Posts

Showing posts from October, 2025

Old Generation

 . ఒక తరం కనుమరుగౌతుంది, ఒక్కొక్కరుగా, ఒకరి తర్వాత ఇంకొకరుగా.. స్వార్థం లేని తరం, నిస్వార్థంగా అందరి అభివృద్ధిని ఆకాంక్షించిన తరం. మమతను పంచిన తరం.  మాధుర్యాన్ని అందించిన తరం. అన్నం తినేముందు  ఇతరుల ఆకలిని గుర్తించిన తరం. ఇరుకు ఇంట్లో కూడా గొప్ప ప్రేమతో బ్రతికిన తరం. కోరికలకంటే బాధ్యతల్ని ఎరిగిన తరం. నా కోసం అనేకన్నా, మనకోసం అని బ్రతికిన తరం. డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం. గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. పుస్తకాలు చదువకున్నా, జ్ఞానాన్ని నింపుకున్న తరం. కాలిక్యూలేటర్స్ లేకున్నా  లెక్కలు చేయగలిగిన తరం. మొబైల్ ఫోన్ లు లేకున్నా.. అందరికీ అందుబాటులో ఉన్న తరం. TV లు లేకున్నా సంతోషంగా బ్రతికిన తరం. GPS లు లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగిన తరం.  సాంకేతికత లేకున్నా,  సమర్థవంతంగా బ్రతికిన తరం. AC లు, కూలర్లు లేకున్నా.. ఆరుబయట హాయిగా నిద్రించిన తరం. ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ లేకున్నా.. బావి నీరు, కుళాయి నీరు త్రాగిన తరం. రెస్తారంట్లు, రకరకాల మెనూ ఐటమ్స్ లేకున్నా.. పచ్చడి మెతుకులు తిని కూడా ఆనందంగా బ్రతికిన తరం. రాత్రిళ్ళు గుడి ద...

1951-1970 Generation

 *1950-70 లో పుట్టిన వాళ్ళ జ్ఞాపకాల దొంతర* SSC పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం మనది . అద్దెకి బుక్స్ (నవలలు ) తెచ్చుకుని చదువుకున్న తరం మనది. సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టిన కాలం మనది. గెజిటెడ్ ఆఫీసర్లు అయినా, కాలేజీ లెక్చరర్స్ అయినా సైకిళ్లు తొక్కుకుని ఆఫీస్ లకు వెళ్లిన రోజులవి. అందుకే డ్రాయింగ్ రూమ్ జిమ్ములలో సైకిల్ తొక్కే అవసరం పడేది కాదు. చేబదుళ్లకి కాదేదీ అనర్హం. పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో చెక్కర అయినా, స్పున్ తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ అయినా. అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు. రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం క్యూ లో నిలబడి డ్యూయెట్లూ, పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి. *ఇంటి ముందుకు* కోతులాడించేవాడు, పాములాడించేవాడు, గంగిరెద్దులాడించే వాడు, ఎలుగు బంటిని తెచ్చేవాడు, చిలక జోస్యం చెప్పేవాడు, వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చ...