SIVALAYAM NAVA NANDI TEMPLES
సుప్రసిద్ధ శివాలయాలు (విశిష్ట శివ లింగాలు)
కర్నూలు జిల్లా, నంద్యాల పట్టణం పరిసర ప్రాంతములో 'నవనందులు' అను శైవ క్షేత్రాలున్నాయి. వీటిని ఒకే రోజున సందర్శించుట పుణ్యదాయకం. ముఖ్యముగా సోమవారం లేదా పౌర్ణమి సందర్భముగా 'నవనందుల యాత్ర' శుభ ఫలములు కలుగును అని స్ధల పురాణలు ఘోచించు చున్నాయి. సూర్యోధయం నుంచి సూర్యోస్తమయం లోపు ఒక వరస క్రమ పద్ధతిలో దర్శించాలి. నవనందుల యాత్రలో ముందుగాను మరియు ముగింపులోను తప్పక నంద్యాల పట్టణంలోని శ్రీ సాక్షి మల్లిఖార్జున స్వామిని దర్శించుట ఆచారం. నవనందులును సందర్శించుటకు నంద్యాల పట్టణంలో మంచి రవాణా సౌకర్యములు దొరుకుతాయి. యాత్రికులకు నంద్యాలలో మంచి వసతులున్నాయి.
పూర్వం శిలాదుడు అనే ఋషి సంతానం కోసం తపస్సు చేసి శంకరుని మెప్పించుతాడు. శివ అనుగ్రహముతో సంతానం పొందుతాడు. అతనికి ‘‘నంది’’ అని పేరు పెట్టి పెంచాడు. కొంత కాలము తరువాత పరమశివుని దర్శనం కోరిన నంది ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకొమ్మన్నాడు. సదా శివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం నంది కోరుకున్నాడు. భక్తిని కోరిక ప్రకారం నంది జన్మించిన స్ధలం నందు శివుడు స్వయంభూ లింగముగా వెలసినాడు. ఆ స్వామి శ్రీ మహా నందీశ్వరుడుగా ఖ్యతి గాంచినాడు. క్షేత్రం మహానందిగా పిలువబడుచున్నాది. మహా నంది క్షేత్రం పరిసర ప్రాంతములో మరో ఎనిమ్మిది స్వయంభూ లింగములు వెలుస్తాయి. ఈ తొమ్మిది శివ లింగాలు నంది పేరుతో పిలువబడుచున్నాయి. తొమ్మిది శైవ క్షేత్రాలును 'నంది మండలం' గా పిలుస్తారు.
✳ శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయం :
నంద్యాల RTC బస్ స్టాండ్ కి సమూరు 1.7 kms దూరంలో ఉంది. ఆలయ ప్రాంగణములో శ్రీ మల్లిఖార్జున స్వామి, శ్రీ భ్రమరాంబ దేవి, శీ అయ్యప్ప స్వామి ఆలయాలు కలవు.
▪ 1. ప్రథమ నంది:-
నవ నందులలో ప్రథమ నందీశ్వరాలయం ఒకటి. ఇది నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం సమీపంలో గల చేమ కాల్వ గట్టున ప్రథమ నంది ఆలయం ఉంటుంది.
గర్భాలయంలో 'కేదారేశ్వర లింగం' భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మ వారిని 'కేదారేశ్వరి మాత' గా పిలుస్తారు. ఆలయ దర్శనం ఉదయం 06 నుంచి 11 & సాయంత్రం 06 నుంచి 08 గంటలు వరకు దొరుకుతుంది.
▪ 2. నాగనంది:-
నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ నాగనందీశ్వరుడు కొలువుదీరాడు. ఇది శ్రీ ఆంజనేయ - కోదండ రామాలయంగా ఖ్యాతి కెక్కినది. ఆంజనేయ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయస్వామి మూర్తి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి ముఖ మండపంలో నాగ నందీశ్వరుడు కొలువుదీరాడు. ఆలయ దర్శనం ఉదయం 06 నుంచి 11 & సాయంత్రం 06 నుంచి 09 గంటలు వరకు దొరుకుతుంది.
▪ 3. సోమనంది:-
నంద్యాల పట్టణంలో గల ఆత్మకూరు బస్టాండుకు సమీపంలో శ్రీ సోమ నందీశ్వరాలయం కలదు. శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. అమ్మ వారిని శ్రీ సోమేశ్వరి దేవిగా పిలుస్తారు. ఆలయ దర్శనం ఉదయం 06 నుంచి 11 & సాయంత్రం 05 నుంచి 08 గంటలు వరకు దొరుకుతుంది.
▪ 4. శివనంది:-
నంద్యాలకు సుమారు 14 కిలోమీటర్లు దూరంలో
శివనందీశ్వరాలయం కలదు. దీనినే రుద్ర నంది అని కూడ పిలుస్తారు. ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం, కడమల కాల్వ గ్రామంలో ఉంది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్టించినట్లు చెప్పుచుంటారు. ఆలయ ప్రాంగణంలో గల కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా చెప్పుచుంటారు. అమ్మ వారిని శ్రీ పార్వతి దేవిగా పిలుస్తారు. ఆలయ దర్శనం ఉదయం 06 నుంచి సాయంత్రం 07 గంటలు వరకు దొరుకుతుంది.
▪ 5. విష్ణునంది / కృష్ణ నంది:-
శివనందీశ్వరస్వామి ఆలయానికి సుమూరు తొమ్మిది కిల్లో మీటర్లు దూరంలో తెలుగు గంగ కాల్వకు సమీపంలో విష్ణు నందీశ్వరాలయం ఉంది. ఆలయానికి చేరుకున్న భక్తులు, ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. ఆలయ శోభ వర్ణనాతీతం. గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అమ్మ వారిని శ్రీ భవానీ మాతగా పిలుస్తారు. దివ్యాలయం చుట్టూ పురాతన కాలం నాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మి మందిరాలు ఉన్నాయి. ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఆలయ దర్శనం ఉదయం 06 నుంచి సాయంత్రం 06 గంటలు వరకు దొరుకుతుంది.
▪ 6. మహానంది:-
విష్ణునంది కి సుమూరు 14 కి.మీ. దూరంలో మహానంది ఉంది. ఇది ఆహ్లాదకరమైన యాత్రా స్థలం. నవ నందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం. గుడి చుట్టు ప్రవహించే నీటి బుగ్గల చల్లదనం, చుట్టు అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోను భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది. క్షేత్రంలో వెలసిన మహానందీశ్వర లింగం స్వయంభూలింగం గా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో ఉన్న శివలింగం పై భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తారు. ఆలయం నందు పార్వతీదేవి కామేశ్వరిగా కొలువులందుకుంటోంది. ఆలయ దర్శనం ఉదయం 06 నుంచి 12 & మధ్యహ్నం 02 నుంచి రాత్రి 08 గంటలు వరకు దొరుకుతుంది. నంద్యాల నుంచి మహానంది కి బస్సులు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమూరు 18 కి.మీ.
▪ 7. వినాయక నంది:-
మహానంది లోని శ్రీ మహానందీశ్వరాలయం నకు ఈశాన్య దిశలో వినాయక నంది ఉంది. ఇది మహానందీశ్వరాలయంలో ఒక భాగం. వినాయక నంది ఆలయం లోని శివలింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్టించినట్లుగా స్థల పురాణాలు చెబుతున్నాయి.
దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. నాగ ఫణాఫణి ఛత్రంగా స్వామివారు అలరారుతున్నారు. ఆలయ దర్శనం ఉదయం 06 నుంచి 12 & మధ్యహ్నం 02 నుంచి రాత్రి 08 గంటలు వరకు దొరుకుతుంది.
▪ 8. గరుడ నంది:-
మహానంది దివ్య క్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుదీరాడు. మహానంది క్షేతానికి ప్రారంభంలో ఉన్న గరుడ నందీశ్వరాలయం అతి పురాతనమైనది. గరుత్మంతుడు ప్రతిష్టించినట్లుగా స్థల పురాణాలు చెబుతున్నాయి. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. మహానంది - శ్రీ మహానందీశ్వరాలయం నకు సుమారు అర కీ.మీ దూరం లో నంద్యాల వైపు పోవు రోడ్డు మార్గం ప్రక్కన శ్రీ గరుడ నందీశ్వరాలయం ఉంటుంది. ఆలయ దర్శనం ఉదయం 06 నుంచి 11 & సాయంత్రం 05 నుంచి రాత్రి 07 గంటలు వరకు దొరుకుతుంది.
▪ 9. సూర్యనంది:-
గరుడ నందీశ్వరాలయం కు సుమారు 11 కిలోమీటర్లు దూరంలో శ్రీ సూర్య నందీశ్వరాలయం కలదు. సూర్యుడు శివుడి గురించి తపస్సు చేసి ఒక లింగాన్ని ప్రతిష్టించాడు. దీనినే సూర్యనందిగా పూజించుతారు.
అమ్మ వారిని శ్రీ గౌరీ పరమేశ్వరి దేవిగా పిలుస్తారు.
ఆలయ దర్శనం ఉదయం 06 నుంచి రాత్రి 07 గంటలు వరకు దొరుకుతుంది. మహానంది నుంచి
నంద్యాల పోవు రోడ్డు మార్గములో తమ్మడ పల్లె గ్రామంలో ఉంటుది. తమ్మడ పల్లె నుంచి నంది పల్లె కు పోవు రోడ్డు మార్గము (side route) లో శ్రీ సూర్య నందీశ్వరాలయం ఉంటుంది.
కార్తీక మాసంలో సోమవారం మరియు కార్తీక పౌర్ణమి రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవ నందుల దర్శనం వల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నవ నందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భావించుతారు.
కార్తీక పౌర్ణమి నాడు నంద్యాల స్ధానికులు మరియు చుట్టూ ప్రక్కల ప్రాంతము వారు పాద యాత్రగా 'నంది మండలం' ప్రదిక్షణ గావించుతారు. ఈ పాద యాత్ర సమారు 70 కీ.మీ గా ఉంటుంది. భక్తులు ముందుగా శ్రీ సాక్షి మల్లిఖార్జున స్వామిని దర్శించుతారు. అక్కడ నుంచి ప్రథమ నంది, నాగ నంది, సోమ నంది, శివ నంది, విష్ణు నంది, మహా నంది, వినాయక నంది, గరుడ నంది, సూర్య నందిని దర్శించుతారు. పిమ్మట శ్రీ సాక్షి మల్లిఖార్జున స్వామి ఆలయంకు బయలు దేరుతారు. సాక్షి మల్లిఖార్జున స్వామి దర్శనంతో యాత్ర పూర్తి అవుతుంది.
నంద్యాల పట్టణంలో శ్రీ మల్లిఖార్జున స్వామి,
ప్రథమ నంది, నాగ నంది, సోమ నంది ఆలయాలు ఉంటాయి. శివ నంది, విష్ణు నంది ఆలయాలు కుగ్రామంలో ఉంటాయి. గ్రామాల రోడ్డు మార్గములు ఇరుకుగా ఉండును. ఆటోలు మాత్రమే వెళ్ళగలవు.
నంద్యాల నుంచి నవనందులును సందర్శించుటకు ఆటోలు దొరుకుతాయి.
🚂 గుంటూరు - గుంతకల్ రైలు మార్గములో నంద్యాల రైల్వే జంక్షన్ ఉంది. నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి RTC Bus stand కు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 04 kms. కర్నూలు జిల్లా లోని అన్ని ప్రాంతములు నుంచి నంద్యాల కు బస్సులు ఉంటాయి. నంద్యాల RTC బస్ స్టాండ్ నుంచి నవనందులును సందర్శించుటకు ఆటోలు దొరుకుతాయి. నంద్యాలలో మంచి వసతులు కలవు.
Good 👍
ReplyDelete